Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు..! ఏంటి అంత పెరిగిందా.? 13 d ago

8K News-10/04/2025 బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. ట్రంప్ సుంకాల కారణంగా పసిడి కి డిమాండ్ బాగా పెరిగింది..దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని చూస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ (గురువారం) 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2700, ₹2940 పెరిగి పసిడి గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,600 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,380 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో రూ.2 వేల పెరిగి కేజీ వెండి ధర రూ.1,04,000 వద్ద పలుకుతుంది.